భూమి కొంటున్నారా ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రియల్ ఎస్టేట్ రంగం మోసాలమయమైపోయింది. చోటామోటా కంపెనీలు సరేసరి.. పేరొందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా నిబంధనలను నూరు శాతం పాటించడం లేదు. అన్ని అంశాలను పరిశీలించి స్థలం కొనకపోతే ఆ తర్వాత నష్టపోయేది కొనుగోలుదారే. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవవాలి.
1. మీకు అమ్మడానికి వచ్చిన వ్యక్తిని ముందు ఆ ల్యాండ్ డాక్యుమెంట్ అడిగి తీసుకోవాలి.
2. దానిని శ్రద్ధగా చదవాలి , నిశితంగా పరిశీలించాలి.
3. మీకు అమ్ముతాను అని చెప్పిన వ్యక్తి పేరు ఆ డాక్యుమెంట్లో ఉన్న పేరు ఒకటేనా లేదా అని చూసుకోవాలి.
4. అవసరమైతే ఆధార్ కార్డు అడిగి తీసుకుని మరీ సరి పోల్చుకోవాలి.
5. అమ్ముతాను అని వచ్చిన వ్యక్తికి అసలా ఆస్తి ఎలా సంక్రమించిందీ ఒకసారి అడిగి తెలుసుకోవాలి.
6. వర్ఫ్ భూములు, ఎండోమెంట్ భూములు, అసైన్డ్ భూములు కొనకూడదు. వాటిని అమ్మేహక్కు విక్రయదారునికి, కొనే హక్కు లేదు. గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాబట్టి ఎప్పుడైనా తిరిగి తీసుకునే హక్కు గవర్నమెంటు ఉంటుంది.
7. ఆర్ఎస్ఆర్ సేత్వార్ ప్రకారం ప్రభుత్వ భూమిగా వున్నదా లేక పట్టా భూమిగా వున్నదా పరిశీలించాలి.
8. ప్రభుత్వ భూముల నిషేధిత జాబితాలో కొనుగోలు చేయు భూమి యొక్క సర్వే నెంబరు నమోదు అయివున్నదా లేదా చూసుకోవాలి. నమోదు అయి వుంటే సదరు భుమిని కొనుగోలు చేయకూడదు.
9. మాజీ సైనికాధికారులకు ఇచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల వరకు అమ్మకూడదు. అందువల్ల అలాంటి వారి దగ్గర కొనాలనుకుంటే వారికి ఆ భూమి వచ్చి 10 ఏళ్లు దాటిందో లేదో చూసుకుని మరీ కొనాలి.
10. నిర్లక్ష్యం చేయకుండా మీకు అతనిచ్చిన డాక్యుమెంట్‌లోని సర్వే నంబరు, మీకు అమ్ముతాను అని చూపిస్తున్న ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటేనా కాదా తెలుసుకోవాలి.
11. ఒక్కోసారి ఎక్కువగా ఎవరూ రాని, గమనించని ల్యాండ్ ఒకటి చూసుకుని ఈ డాక్యుమెంట్‌లోని ల్యాండ్ ఇదే అని చెప్పి అమ్మేస్తారు. మనం ఎవరినైనా లోకల్ సర్వేయర్‌ని తీసుకువచ్చి ఆ ల్యాండ్ సర్వే చేయించినా ఆ విషయం పైకి తేలదు. ఎందుకంటే అతనికి కూడా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తెలీదు అమ్ముతాను అని చెప్పిన వ్యక్తి చూపించిన ల్యాండ్‌ని సర్వే చేసి వెళ్ళిపోతాడు. అందువల్ల సర్వే కొలత సరిగ్గా వచ్చింది అని ల్యాండ్ కరెక్ట్ అనుకోకండి. డాక్యుమెంట్‌లోని సర్వే నెంబర్ అతను చూపిస్తున్న ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటేనా కాదా అని వీఆర్వోని అడిగి తెలుసుకోవాలి
12. వీఆర్వోను అమ్మకానికి వచ్చిన ల్యాండ్ దగ్గరకు తీసుకెళ్లి చూపించి అడగాలి. ఒక్కోసారి ల్యాండ్‌ని అసలు ఓనర్స్ కాకుండా జీపీఏ (జనరల్ పవర్ అఫ్ అటార్నీ) ీVAల్డర్స్ అమ్ముతుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అసలు ఓనరికి ఎంతో కొంత బయానా లేదా అడ్వాన్సు ఇచ్చి ఒక 4 నెలల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని చెప్తారు. ఈలోపు దాన్ని ఎవరికో ఒకరికి మంచి బేరానికి అమ్మే ఒప్పందం చేసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మోసం జరిగే అవకాశం ఉంది. అమ్మే హడావిడిలో ఎక్కువ వివరాలు సేకరించకుండా మనకు అమ్మేస్తారు. ఆ తర్వాత మోసపోయాక మనకు అసలు ఈ జీపీఏ హెల్డర్ కనిపించరు, అతనికి అమ్మిన అసలు ఓనర్ కనిపించరు. తర్వాత కోర్టులు కేసులు అని తిరగాల్సి వస్తుంది. ల్యాండ్ మ్యాప్‌లో సర్వే నెంబర్ ఉంది అని తెలుసుకున్నాక, ఆన్లైన్లో ఈసీ తీసుకోవాలి. దీనివల్ల మనకు ఆ పొలం ఎటువంటి లోన్లు, తాకట్లు లాంటివి ఉన్నాయో తెలుస్తుంది. ఉదాహరణకు నేను ఐసీఐసీఐ బ్యాంకులో నా పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకున్నాను అనుకోండి అది మనకు జుజలో తెలిసిపోతుంది. అదే కాకుండా ఇంకా ఆ ప్రధాన సర్వే నంబర్ల కింద ఉన్న వేరు యజమానులు పేర్లు కూడా తెలుస్తాయి. అందులో లింక్ డాకుమెంట్స్ కూడా దొరుకుతాయి. మీరు జుజ ఆన్లైన్లో తీయాలి అంటే మీ-సేవ లేదా సచివాలయంకు వెళ్లి అడిగినా కూడా ఇస్తారు.
13. తర్వాత పహాణీ లేదా అడంగళ్ కాపీలను ఎంత కుదిరితే అంత పాత కాలం నుండి అడిగి తీయించండి.
14. పహాణీలో ఏముంటుంది అంటే ఆ ఫలానా సర్వే నెంబర్ ల్యాండ్‌లో ఏ సంవత్సరంలో ఎవరు సాగులో ఉన్నారు. ఎంత విస్తీర్ణంలో సాగులో ఉన్నారు. సాగులో ఉన్నవారు యజమానా లేదా కౌలుదారా వంటి విషయాలు ఉంటాయి. ఈ పహాణి అనేది ప్రతి సంవత్సరం ల్యాండ్ సందర్శించి తెలుసుకుని కొత్త పహాణీ రాస్తూ ఉండాలి. పాత పహాణీలు కూడా భద్రపరుస్తూ ఉంటారు.
15. మీరు కొనేటప్పుడు మండల ఆఫీస్‌కి వెళ్లి పాత పహాణిలన్నీ తీయించి చూస్తే మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఈ అమ్మే వ్యక్తి సాగులో ఉన్నారో తెలిసిపోతుంది.
16. ఫారం-1బి కూడా ఆన్లైన్లో నుండి సేకరించాలి.
17. ఒక్కోసారి ఒక వ్యక్తి ల్యాండ్ కొనుక్కుంటాడు. ఆ ల్యాండ్ కొత్త వ్యక్తి పేరు మీద రెవిన్యూ, గవర్నమెంట్ రికార్డులలోకి మారడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా కొన్ని రోజుల వరకు రికార్డులలో పాత అమ్మిన వ్యక్తి పేరు కనిపిస్తూ ఉంటుంది. మోసం చేయాలి అనుకున్నవారు కొనుక్కున్న వ్యక్తి పేరు మీదకు మ్యుటేషన్ అవ్వకముందే ఇంకొకరికి అమ్మేస్తారు. ఒక్కోసారి కొనుక్కునే వారి నిర్లక్ష్యం వల్ల కూడా తప్పు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇక మా పని అయిపొయింది అన్నట్లుగా మ్యుటేషన్ మీద శ్రద్ధ చూపరు, మర్చిపోతారు. 2 లేదా 3 సంవత్సరాలైనా అసలు మ్యుటేషన్ అనేది ఒకటుంటుంది అనే ఆలోచన రాదు. ఈలోపు ఆ మొదట అమ్మిన వ్యక్తి మళ్ళీ వేరొకరికి అమ్ముతాడు. పాపం ఇందులో కొనుక్కున్న వారి తప్పు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఇంకా పాత వ్యక్తి పేరే కనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్లు చూసుకోవాల్సిన చెక్ లిస్ట్ ప్రకారం అది సరిగ్గానే ఉంటుంది కాబట్టి కొనేసుకుంటారు. ఈ లోపు ఇంతకుముందు కొన్న రెండవ వ్యక్తి వచ్చి ఇది నాది అని క్లెయిమ్ చేస్తాడు. ఈ సందర్భంలో తప్పు ఫస్ట్ అమ్మిన వ్యక్తి మోస గుణం, రెండో కొనుక్కున్న వ్యక్తి నిర్లక్ష్యం. బలయ్యేది మూడో కొన్న వ్యక్తి.
18. మీకు అమ్ముతాను అని చెప్పిన వ్యక్తిది ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని పైన సేకరించిన అన్ని డాకుమెంట్స్ తీసుకుని ఒక లాయర్ దగ్గరకు వెళ్లి అవన్నీ చూపించి అంతా సవ్యంగా ఉంది లేనిది తెలుసుకోవాలి. ఇక్కడ లాయర్ ఖర్చు ఎందుకు దండగ అని అని మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం తర్వాత ఇబ్బందుల్లో పడతారు.
19. రిజిస్ట్రేషన్ కు వెళ్ళేటప్పుడు పొలం అమ్ముతున్న వ్యక్తే కాకుండా అతని తల్లిదండ్రులు, భార్య, అన్న దమ్ములు, మేజర్ అయిన పిల్లలు ఇలా ఎవరు ఉన్నా వారందరితో కూడా సంతకం పెట్టించడం మర్చిపోకండి. ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో వాళ్లలో ఎవరో ఒకరు వచ్చి అతను మా ప్రమేయం లేకుండా మా పర్మిషన్ లేకుండా అమ్మాడు. అది మాది అని క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది.
20. ప్లాట్ లేదా పొలానికి ఒక్కోసారి దారి ఉండదు. దారి లేనిప్లాట్ లేదా పొలం కొనుక్కోవడం వృధా. అందువల్ల కాస్త ఖర్చు ఎక్కువ అయినా దారి ఉన్న పొలం కొనుక్కోండి. ఒకవేళ దారి లేకపోతే పక్క పొలాల వారిని అడిగి వారికి ఇష్టముంటే ఎంతో కొంత ఇచ్చి కొనుక్కోవచ్చు. దీనికి కూడా పైన చెప్పిన పాయింట్ లోని నిబంధన వర్తిస్తుంది. మీకు దారి అమ్మిన వ్యక్తి పొలం ఇద్దరు అన్నదమ్ములది అనుకోండి. అన్న వేరే ఊర్లో ఉంటాడు. తమ్ముడు అన్నకు తెలీకుండా డబ్బుకోసం ఏదో నోటి మాట మీద దారి అమ్మాడు అనుకుందాము. కొన్ని రోజుల తర్వాత అది అన్నకు తెలిసి మీతో గొడవ పడే అవకాశం ఉండి. ఈ విషయం లో తప్పు మీదే అవుతుంది.
21. ఇక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యుటేషన్ కి అప్లై చేయడం అస్సలు మర్చిపోకండి.
22. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీరు కొన్న స్థలానికి కంచె వేయించండి.
23. ఒక బోర్డు తీసుకుని ‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు’ అని దాని మీద మీ పేరు, సర్వే నంబరు, ఫోన్ నంబరు రాయించండి.
24. తప్పకుండా చిన్నదైనా ఒక గేట్ పెట్టించండి. 4 రేకులతో ఒక షెడ్ వేయించండి. ఇదంతా ఎందుకు అంటే చూసేవారికి “ఓహ్ ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎప్పుడూ వస్తుంటారు.” అనే భావన కలిగించడం కోసం.
లోడ్ అవుతోంది…




