19, ఆగస్టు 2026, బుధవారం
KVR BRAND
KVR BRAND

రెరా వివరాలు ఇవ్వట్లేదా? అయితే ఏజెన్సీల ఆటకట్టించండి!గృహ కొనుగోలుదారులకు ఈడీ కీలక హెచ్చరిక

ప్రతి సామాన్యుడి జీవితంలో సొంతింటి కల ఒక అతిపెద్ద ఆశయం. ఎంతో కష్టపడి కూడబెట్టిన జీవితకాలపు పొదుపును ఆ కల కోసం రియల్ ఎస్టేట్ సంస్థల చేతిలో పోస్తుంటారు. కానీ, కొందరు ప్రమోటర్లు, బడా బిల్డర్లు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువునా ముంచుతున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టి, గృహ కొనుగోలుదారులకు అండగా నిలిచేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలపై సంచలన ప్రకటన చేస్తూ, కొనుగోలుదారులను అప్రమత్తం చేసింది.

KKVR Admin19 ఆగ, 2026 12:55 AM0
రెరా వివరాలు ఇవ్వట్లేదా? అయితే ఏజెన్సీల ఆటకట్టించండి!గృహ కొనుగోలుదారులకు ఈడీ కీలక హెచ్చరిక

అసలేం జరిగింది? ఈడీ ఎందుకీ ప్రకటన చేసింది?

ఇటీవల అహ్మదాబాద్‌కు చెందిన ఒక బడా స్థిరాస్తి సంస్థ ఖాతాదారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. కానీ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఏకంగా రూ. 129.80 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ భారీ జప్తు నేపథ్యంలోనే ... దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ ఈడీ కీలక సూచనలు జారీ చేసింది.

ఉపేక్షించవద్దు ... తక్షణం ఫిర్యాదు చేయండి

ఏదైనా ప్లాట్ లేదా ఫ్లాట్ కొంటున్నప్పుడు, బిల్డర్లు లేదా రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే భయపడవద్దని, వెంటనే ఫిర్యాదు చేయాలని ఈడీ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా కింది సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి.

  • ప్రతి ప్రాజెక్టుకు స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా) రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ నెంబర్ అడిగినప్పుడు బిల్డర్ దాటవేసినా, ఇవ్వడానికి నిరాకరించినా సదరు సంస్థపై ఫిర్యాదు చేయాలి.

  • ముందుగా డబ్బులు కట్టించుకుని, అగ్రిమెంట్ ప్రకారం సమయానికి రిజిస్ట్రేషన్ చేయకుండా రోజుల తరబడి     ముప్పుతిప్పలు పెడుతున్న బిల్డర్లపై చర్యలు తప్పవు.

  • లావాదేవీల్లో ఎక్కువ భాగం “నగదు” రూపంలోనే ఇవ్వాలని పట్టుబట్టినా అది చట్టవిరుద్ధమే.

  • ఏవైనా కారణాల వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా లేదా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయినా ... కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా వేధిస్తుంటే కంప్లైంట్ చేయొచ్చు.

  • విక్రయించాల్సిన ఆస్తిని, మీకు తెలియకుండా మరొకరికి అమ్మే ప్రయత్నం చేసినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

నగదు లావాదేవీలు ... కొనుగోలుదారుల పాలిట ఉరితాడు!

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత లోపించడం వల్ల ఒకప్పుడు ఎంతో మంది మోసపోయి రోడ్డున పడ్డారు. అందుకే కొనుగోలుదారుల రక్షణ కోసం ప్రభుత్వం ‘రెరా’ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ‘రెరా’లో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్ అంటే దానికి చట్టబద్ధత ఉన్నట్లు లెక్క. ఆ వివరాలు దాస్తున్నారు అంటేనే... ఆ ప్రాజెక్టులో ఏదో లోపం ఉన్నట్లు లేదా ప్రభుత్వ అనుమతులు లేనట్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి కోసం “నగదు” రూపంలో లావాదేవీలు జరపమని అడగడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉంటుందని ఈడీ హెచ్చరిస్తోంది. ఇలా చేయడం ద్వారా బిల్డర్లు బ్లాక్ మనీని ప్రోత్సహించడమే కాకుండా ... భవిష్యత్తులో ఆ ప్రాజెక్టులో ఏదైనా వివాదం వస్తే, కస్టమర్ వద్ద తాను డబ్బు కట్టినట్లు ఎలాంటి బ్యాంక్ ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఇది అంతిమంగా వినియోగదారుల పాలిట ఉరితాడుగా మారుతోంది.

అప్రమత్తతే శ్రీరామరక్ష

కాబట్టి వినియోగదారులు ప్రాపర్టీ కొనే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు వారి ‘రెరా’ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగి తీరాలి. ఆన్‌లైన్‌లో ఆ నెంబర్ ఎంటర్ చేసి, ప్రాజెక్ట్ వివరాలు సరిచూసుకోవాలి. హక్కుల పట్ల అవగాహన పెంచుకోండి. పారదర్శకత లేని లావాదేవీలను నిలదీయండి. ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆధారాలతో సహా రాష్ట్రాల్లోని రేరా, వినియోగదారుల కమిషన్లకు ఫిర్యాదు చేయడానికి ఏమాత్రం వెనుకాడవద్దు.

సంబంధిత వార్తలు

కరెంట్ కనెక్షన్ పొందడం ప్రాథమిక హక్కు నిరాకరిస్తే తప్పదు చిక్కు!హైకోర్టు సంచలనాత్మక తీర్పు

కరెంట్ కనెక్షన్ పొందడం ప్రాథమిక హక్కు నిరాకరిస్తే తప్పదు చిక్కు!హైకోర్టు సంచలనాత్మక తీర్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిట్ పిటీషన్ నెం. 8103/2026లో వెలువడిన తీర్పు ... కండకావరంతో వ్యవహరిస్తూ కొత్త కరెంటు కనెక్షన్ల మంజూరులో ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న కొంతమంది విద్యుత్ అధికారుల అహంకారంపై కొరడా ఝళిపించినట్లైంది. విద్యుత్ సదుపాయం అనేది భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని నిరాకరించడం అంటే ప్రజల జీవించే హక్కును ఉద్దేశపూర్వకంగా కాలరాయడమేనని తీర్పులో న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కనీస కారణం చెప్పకుండా, అడ్డగోలు సాకులతో విద్యుత్ కనక్షన్ దరఖాస్తును ఏకపక్షంగా ‘శాశ్వతంగా తిరస్కరించడం’ డిస్కం అధికారుల బరితెగింపునకు, బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట నిలుస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన పోకడలను తక్షణం విడనాడాలని, రద్దు చేసిన ఆ చెత్త ప్రొసీడింగ్స్ పక్కనపెట్టి పిటిషనర్‌కు రెండు వారాల్లోగా కనెక్షన్ ఇచ్చి తీరాలని, అధికారులకు చెంపచెల్లుమనిపించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందని పబ్లిక్ ఫోరం వాఖ్యానించింది. ఇకపై దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారో స్పష్టమైన కారణాలు చెప్పాల్సిందేనని, సర్వీసు కనెక్షన్ల జారీపై డిస్కంల నుంచి ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించాలి. ఖచ్చితత్వం లేని నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెట్టి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే అధికారుల తోలుతీస్తామన్న రేంజ్‌లో హైకోర్టు తీర్పు ఉంది ... నిర్లక్ష్యపు నిద్రలో ఉన్న కొంతమంది విద్యుత్ అధికారుల్లో ఈ తీర్పు గుబులు పుట్టిస్తోంది.

2 గంటల క్రితం

రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ 'ప్రయోగం'

రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ 'ప్రయోగం'

ముంచుకొస్తున్న ప్రమాదాలు - గాల్లో కలుస్తున్న గోప్యత!

1 రోజుల క్రితం

ఎవిడెన్స్-బేస్డ్ జర్నలిజానికి ‘ఆర్టీఐ’ ఆయుధం!

ఎవిడెన్స్-బేస్డ్ జర్నలిజానికి ‘ఆర్టీఐ’ ఆయుధం!

1 రోజుల క్రితం

చైతన్యమే లక్ష్యంగా kvrbrand.com

చైతన్యమే లక్ష్యంగా kvrbrand.com

హక్కులకై అడుగేయ్ ... వాస్తవాలు అడిగేయ్!

1 రోజుల క్రితం