ఆర్టీఐ చట్టం, నియమావళిలో సమాచార హక్కు దరఖాస్తుకు, అధికార యంత్రాంగం ఇచ్చే సమాధానాలకు నిర్దిష్టమైన ప్రామాణికం, నమూనా అంటూ ఏదీ లేదు. సమాచారం కోరుతూ ఆర్టీఐ చట్టం సెక్షన్ 6 (1), మొదటి ఇప్పీలు 19 (1)కు ఎటువంటి నమూనాలు లేనందున దరఖాస్తుదారులు తెల్లకాగితంపై తనకు కావల్సిన సమాచారాన్ని, అప్పీలును పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు దరఖాస్తు చేయవచ్చు. ఈ మేరకు ఆర్టీఐకు నిర్దిష్టమైన ‘నమూనా’ ఏదీ లేదని కేంద్ర సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సిబ్బంది, శిక్షణ విభాగం (ఫైలు నెం. 10/1/2013-ఐఆర్ తేది 11-11-2014) ఆదేశాలు జారీ చేసింది.
అయితే రెండో అప్పీలుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005లో 22వ కేంద్ర చట్టం)-ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ అప్పీళ్లను పరిష్కరించే కార్యవిధానం-ఉత్తర్వుల ప్రకారం (ప్రధాన పరిపాలన (సమాచార, పౌరసంబంధాలు-1) 2 2.2.2.2.3. 66 : 25-2-2006)నిర్ధిష్టమైన నమూనా ఉంది. అదే విధంగా కేంద్ర సమాచార కమిషన్కు దాఖలు చేసే రెండో అప్పీలుకు కూడా నిర్ధిష్టమైన నమూనా ఉంది. అందుకు అనుగుణంగా అప్పీలు చేయాలి.



