రోగికీ ఉన్నాయి హక్కులు ...
-ఆస్పత్రికి వస్తే వైద్య చికిత్స అందించాలి ... చికిత్స పద్ధతులు, ధరలను చెప్పాలి
-వ్యాధి ఏమిటనేది వివరించాలి ... కేస్ షీట్స్ అడిగితే అందజేయాలి
రోగులకు కొన్ని హక్కులుంటాయి. రోగుల హక్కుల చార్టర్లో ఈ హక్కులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ...
సమాచార హక్కు
రోగి ఎదుర్కొంటున్న సమస్యలను వైద్యులు గుర్తించి వారికి సమాచారమందించాలి. రోగి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వెంట వచ్చిన సహాయకుడికి అందించాలి. అదీ వారికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. చికిత్సలందిచే వైద్యులు, నిపుణుల గుర్తింపు, వృత్తిపరమైన స్థితి గురించి తెలుసుకునే హక్కు రోగులకు ఉంది. వైద్యానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన సమాచారం లఖిత పూర్వకంగా అందించాలి.
నివేదికలు పొందే హక్కు
అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సంరక్షణ పొందే హక్కు రోగులకు ఉంది. రోగికి సంబంధించిన రికార్డులు, వ్యాధుల నిర్ధారణ ఫలితాల నివేదికలు, కేస్ షీట్స్, కేసును పరిశీలించి అంతర్గతంగా నిర్వహించిన ఫలితాలకు సంబంధించిన నివేదికల పత్రాలను రోగులు, వారి సహయకులు పొందే హక్కు ఉంది. వ్యాధి నిర్ధారణ కేసు పరిశీలన పత్రాలను అడ్మిషన్ జరిగిన 24 గంటలు లేదా డిశ్చార్జి అయిన 72 గంటల్లోగా అందించాలి. రోగి మరణిస్తే దానికి సంబంధించిన నివేదికలను అసలు కాపీలతో రోగి సంరక్షకులకు లేదా బంధువులకు ఇవ్వాలి.
సమాచారం ఇచ్చే హక్కు
ఒక రోగిని ఆపరేషన్, కిమోథెరపీకి తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయిస్తే, త గిన విధివిధానాలు పూర్తి చేయడం, వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులను రోగి లేదా సంరక్షుడికి చెప్పిన తర్వాతే ప్రక్రియను చే పట్టాలి. చికిత్సకయ్యే ఖర్చునూ వివరించాలి. రెండో అభిప్రాయానికి హక్కు రోగి లేదా సంరక్షకులకు నచ్చిన డాక్టర్ లేదా మరో ఆస్పత్రి నుంచి రెండో అభిప్రాయాన్ని (సెకండ్ ఒపీనియన్)ను ఆశిస్తే వారి నిర్ణయాన్ని వైద్యులు, ఆస్పత్రి వర్గాలు గౌరవించాలి. ఈ విషయంలో వారిని వారించడం, నిరుత్సాహపర్చడం వంటివి చేయొద్దు.
ధరల పారదర్శక హక్కు
ఆస్పత్రిలో రోగి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చుల వివరాలను నోటిసు రోగి హక్కు. ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న చికిత్స బోర్డుల రూపంలో ఏర్పాటు చేయాలి. ధరలను తెలుసుకోవడం పద్ధతులు దానికి వసూలు చేసే ధరలను ప్రింటెడ్ బ్రోచర్ల రూపంలో ఇంగ్లీషు, స్థానిక భాషల్లో అందించడం, నోటీసు బోర్డులో అందరికి కనిపించే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
గోప్యత హక్కు
గౌరవం హక్కు రోగికి చికిత్స విషయంలో గోప్యత హక్కు ముఖ్యమైనది. రోగికి ఉన్న అనారోగ్య సమస్య ఏమిటి? చికిత్స ప్రణాళిక గురించి సమాచారాన్ని వైద్యులు గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అసాధారణమైన సందర్భంలో తప్ప, సమాచారాన్ని పంచుకోవడం, ఇతరులను రక్షించే ఆసక్తితో వెల్లడించడం చేయొద్దు. మహిళా రోగులకు తమకు మహిళ నిపుణుల ద్వారానే వైద్యం ఇప్పించాలని ఆశించే హక్కు ఉంది. రోగులు గౌరవాన్ని నిలబబెట్టడానికి ఆస్పత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోగి విషయంలో వారి అనారోగ్యం, పరిస్థితి, హెచఐవీ స్థితి, వయసు, కులం, జాతి, భాషా, భౌగోళిక, సామాజిక మూలాల ఆధారంగా ఎలాంటి వివక్షత చూపకూడదు.
భద్రత హక్కు
రోగులకు భద్రత పొందే హక్కు ఉంటుంది. పారిశుధ్య సదుపాయాలు కల్పించాలి. సరైన రిఫరల్, బదిలీ హక్కు ఒక రోగిని తప్పనిసరిగా ఒక ఆరోగ్య కేంద్రం నుంచి మరొక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేస్తే, వారికి, సంరక్షకులకు కొత్త ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి సంబంధించి వివరించాలి. బదిలీ తర్వాత కొనసాగించాల్సిన చికిత్సలు, మందుల జాబితాను కూడా ఇవ్వాలి. రోగి లేదా సంరక్షకుడు అంగీకరిచకపోతే ఈ చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. అన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రొటోకాల్స్, సేవలు, ప్రభుత్వం జారీ చేసిన మంచి క్లినికల్ ప్రాక్టీస్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి. ఇక రోగి బయోమెడికల్ లేదా ఆరోగ్య పరిశోధన విధానంలో పాల్గొన్నట్లయితే వారి సమ్మతిని రాతపూర్వకంగా తీసుకోవాల్సి ఉంటుంది. రోగికి డిశ్చార్జి అయ్యే హక్కు ఉంది. ఇంటికి వెళతానంటే నిర్బంధించకూడదు. రోగి మృతదేహాన్ని అప్పగించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. మృతదేహాన్ని పొందే హక్కు సంరక్షకులకు ఉంటుంది.
లోడ్ అవుతోంది…




